Kavitha: ప్రెస్ మీట్లో కవిత సంచలన వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు

Kavitha: భారత రాష్ట్ర సమితిలోని కొందరు నాయకులు తనపై పనిగట్టుకొని విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మాజీ ఎంపి సంతోష్, మాజీ మంత్రి హరీష్ రావులను ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు.
అక్రమ కేసులు పెట్టి అయిదు నెలలు తీహార్ జైల్లో ఉండి వచ్చాకా 2024 నవంబర్ 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేశానని కవిత తెలిపారు. మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం అందించాలని, బీసీ రిజర్వేషన్లు, గురుకులాలు మరెన్నో ఉద్యమాలు చేశామని చెప్పారు. భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల అంశాలపై,బనకచర్ల అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో భూనిర్వాసితులకు అండగా ఉన్నామని చెప్పారు. గులాబీ కండువాలతో 47 నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలను కలుపుకొని అనేక ప్రజా సమస్యలపై మాట్లాడనున్నారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని ఆమె చెప్పాలన్నారు. ఈ అంశంపై భారత రాష్ట్ర సమితి పెద్దలు. పునరాలోచన చేయాలన్నారు.
