Kavitha Resigns: బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత
రాజీనామా చేసిన కవిత

Kavitha Resigns: బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ సస్పెన్షన్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ విధించటంతో తన నిజాయితీ నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కవిత అన్నారు. తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు పార్టీకి,పార్టీ నుంచి సంక్రమించిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నేను చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీలో ఏదో జరిగినట్లు కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. మాజీ ఎంపీ సంతోష్, మాజీ మంత్రి హరీష్ రావు గ్యాంగ్‌లు కవిత విషయంలో జరగంది జరిగినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. సంతోష్, హరీష్ లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో మంతనాలు సాగిస్తున్నారని చెప్పారు. సంతోష్ చేసిన పనులతో కేటీఆర్ కి చెడ్డపేరు వస్తుందని అన్నారు.
