Kavitha: తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పీవీకే-5 భూగర్భ గనిని సందర్శించారు. గని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలో ఆమె ప్రసంగించారు.

కవిత మాట్లాడుతూ, “సింగరేణి ప్రాంతంలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి గోదావరిఖనిలో నిరాహార దీక్ష చేపట్టనున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కార్మికుల పట్ల నిజమైన శ్రద్ధ ఉంటే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలి” అని అన్నారు.

హెచ్‌ఎంఎస్ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల్సి ఉండగా నామమాత్రపు జీతాలు ఇస్తున్నారని కవిత తీవ్రంగా మండిపడ్డారు.

ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలు, వారి హక్కులు, ఆరోగ్య సంరక్షణ, వేతనాలు వంటి అంశాలపై ఆమె దృష్టి సారించారు. కార్మికుల హక్కుల కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతుందని కవిత స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story