CM Revanth Reddy: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు దేశంలోనే ప్రసిద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలోనే ప్రసిద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
‘‘71 సంవత్సరాల క్రితం ఒక అడుగు ఎత్తైన గణేశ విగ్రహంతో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఈ ఉత్సవాలను ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందింది. ఈ రోజుల్లో ఉత్సవ నిర్వహణ అంత సులభం కాదు, అయినప్పటికీ ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఈ సమితి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరం. రాష్ట్రంలోని గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సవాలు పూర్తయ్యాయి. ఈ విజయవంతమైన నిర్వహణకు గణేశ్ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమితికి అన్ని రకాలుగా సహకారం అందిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
