Khammam: ఖమ్మం: బీఆర్‌ఎస్‌కు వరుస ఎదురుదెబ్బలు.. కాంగ్రెస్‌లో చేరిన మరో ముగ్గురు కార్పొరేటర్లు
కాంగ్రెస్‌లో చేరిన మరో ముగ్గురు కార్పొరేటర్లు

Khammam: ఖమ్మం నగరపాలక సంస్థలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో మరో ముగ్గురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. ఈ చేరికలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా ధనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి అనే ముగ్గురు కార్పొరేటర్లకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీహెచ్ లక్ష్మి, జి. చంద్రకళ, డి. సరస్వతి, అమృతమ్మ, ఎం. శ్రావణి కార్పొరేటర్లు కూడా సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుండటంతో బీఆర్‌ఎస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలు మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించాయి.

