KTR Warns: ‘సర్’ పేరుతో నిజమైన ఓటర్లను తొలగించే కుట్ర చేస్తే ఊరుకోం: కేటీఆర్ హెచ్చరిక
కేటీఆర్ హెచ్చరిక

KTR Warns: తెలంగాణలో ఓట్ల తొలగింపు ప్రక్రియలో నిజమైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా ఆరోపించారు. ‘సర్’ (స్పెషల్ అచీవ్‌మెంట్ రివ్యూ) ప్రక్రియను బీఆర్‌ఎస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన కేటీఆర్, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాదిరిగా దొంగ ఓట్లతో గెలవాలని తమ పార్టీ భావించదని కేటీఆర్ స్పష్టం చేశారు.
రైతుభరోసా కార్యక్రమం అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను బురదలో కూర్చోబెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. ‘సర్’ పేరుతో దొంగ ఓట్లను కాపాడుతూ నిజమైన ఓటర్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
- K. T. Rama RaoKTRVoter ListElectoral RollGenuine VotersTelangana PoliticsElection CommissionPolitical WarningVoter RightsDemocratic ProcessElectoral ControversyPolitical NewsTelangana NewsPublic AffairsState PoliticsElection IssuesBreaking NewsCurrent AffairsLatest Telugu NewsPolitical UpdatesGovernanceDemocracy

