Pavan Kalyan : మనం మాట్లాడే భాష మాతృభాష… హిందీ రాష్ట్ర భాష…
రాజభాష స్వర్ణజయంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్

హిందీ భాష మన మీద రుద్దుతున్నారనడం అవివేకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న జీయంసీబాలయోగి ఇన్‌డోర్ స్టేడియంలో జరిగిన రాజ్యభాష స్వర్ణ జయంతి వేడుకల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీయం మాట్లాడుతూ ప్రతి భాష జీవ భాషే అని మనం మాట్లాడే భాష మాతృభాష అయితే హిందీ మాత్రం రాజ్య భాష అని చెప్పారు. ఇంటి బయట సరిహద్దులు దాటితే హిందీ అవసరమని అందుకు అందరూ హిందీ నేర్చుకోవాలని సూచించారు. ప్రపంచం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటుంటే భారతీయులు మాత్రం కలిసేందుకు హిందీ భాషను వెతుకుతున్నారన్నారు. మాతృ భాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హిందీ భాషను అడ్డుకోవడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికి కోల్పవడం కాదని కలిసి ప్రయాణించడమన్నారు. ఉర్దూ, పార్శీ భాషలను నేర్చుకున్న మనం హిందీని ఎందుకు అడ్డకుంటున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
