K. Kavitha: మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టడం ఒక పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గించే ఏ ప్రయత్నం జరిగినా ఊరుకోమని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్‌ కోటా తప్పనిసరిగా ఉండాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story