Panchayat Elections : ఆగస్టులో స్థానిక సంస్ధల ఎన్నికలు
క్యాబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్ధలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఇంతకాలం బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఖారారు కాలేదనే కారణంతో ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది అయితే తాజాగా సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు నెలఖరు వరకూ స్థానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గురువారం జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా పంచాయితీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన ఆర్డెనెన్స్ ను గవర్నర్ వారం రోజుల లోపే ఆమోదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక సారి ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే పదిహేను రోజుల్లో లోకల్ బాడీస్ లో రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ప్రభుత్వ కసరత్తు ప్రారంభించింది. ముందుగా మండల, జిల్లా పరిషత్తుల ఎన్నికలు నిర్వహించి తరువాత పంచాయితీల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
