✕
Lookout Notices Issued Against Bandi Bhagirath: లైంగిక దాడి ఆరోపణలు: బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు
By PolitEnt MediaPublished on
బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు

x
Lookout Notices Issued Against Bandi Bhagirath: మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దేశం దాటకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతని అరెస్టుకోసం పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేయబడింది. అతనితో సంబంధాలు ఉన్నవారు, స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. బంజారాహిల్స్‌లోని బండి సంజయ్ నివాసంలో ఒక బృందం తనిఖీలు నిర్వహిస్తోంది.
ఈ కేసు సంబంధంగా బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు ఈ నెల 8న పోక్సో కేసు నమోదు చేశారు. భగీరథ్ విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Next Story

