Marijuana at singer Mangli's birthday party

ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌ శివారులో జరిగిన ఆమె బర్త్‌డే పార్టీలో గంజాయి సర్వ్‌ చేశారన్న అంశం కలకలం సృష్టిస్తోంది. ఫోక్‌ సింగర్‌ మంగ్లీ.. తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రాత్రి తన స్నేహితులకు, సన్నిహితులకు పార్టీ ఏర్పాటు చేశారు. చేవెళ్లలోని త్రిపురా రిసార్ట్‌లో ఈ బర్త్ డే పార్టీ జరిగినట్లుగా సమాచారం. ఈ బర్త్‌డే పార్టీకి సంబంధించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. అర్థరాత్రి త్రిపురా రిసార్ట్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందంటున్నారు. పలువురికి గంజాయి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో, వారిపై కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు.



చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్స్‌లో మంగళవారం అర్ధరాత్రి సింగర్ మంగ్లీ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 48 మంది వరకు కుటుంబ సభ్యులు, మంగ్లీ సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఉన్నట్లు సమాచారం. వీరందరికీ డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఎస్‌ఓటీ పోలీసులు త్రిపుర రిసార్ట్స్‌లో దాడులు చేశారు. గంజాయి పాజిటివ్‌గా వచ్చిన వాళ్లపై అధికారులు NDPS యాక్ట్‌, సౌండ్ పొల్యూషన్ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు.



సింగర్ మంగ్లీ.. తెలంగాణ ఫోక్ సాంగ్స్‏తో పాపులర్ అయ్యింది. బతుకుమ్మ నుంచి బోనాల పాటల వరకూ మంగ్లీ పాడని పాట లేదు. ఆమె గాత్రానికి శ్రోతలు ఫిదా కావాల్సిందే. పక్కా ఫోక్ సాంగ్ అయినా.. సినిమా పాటలు అయిన తన గాత్రంతో మెస్మరైజ్ చేసింది. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది మంగ్లీ. న్యూస్ యాంకరింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఆ తర్వాత ప్రైవేట్ పాటలతో పాపులర్ అయ్యింది. ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు, శివరాత్రి పాటల ద్వారా తనకంటూ ఓ ఫేమ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాలు, ఈవెంట్లలో పాటలు పాడుతూ బిజీగా ఉంటుంది.కెరీర్ మంచి ఫాంలో ఉండి.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ..ఇప్పుడు ఇలా వివాదంలో చిక్కుకోవడం షాకిస్తుంది. ఇన్నాళ్లు పల్లె పాటలతో అలరించిన మంగ్లీ బర్త్ డే వేడుకలలో డ్రగ్స్ లభించడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది.


Politent News Web4

Politent News Web4

Next Story