మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

  • ఎస్.కే. జోషి,స్మితా సబర్వాల్ నిర్లక్ష్యంతోటే
  • క్యాబినెట్ ఆమోదం లేకుండానే పరిపాలనా అనుమతులు
  • దర్యాప్తు పారదర్శకంగా జరిగింది
  • జస్టిస్ పినాకి చంద్రబోస్ నివేదికలో వెల్లడి

మెడిగడ్డ బ్యారేజ్ కూలిన పాపం ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లదే నని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. బి.ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో కూలిపోయిన మెడిగడ్డ ఉదంతం పై అధికారంలోకి వస్తే న్యాయవిచారణ జరిపిస్తామని ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ,మాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర న్యాయవిచారణ జరిపించాయమన్నారు. అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిందే తడవుగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ను నియమించినట్లు ఆయన గుర్తుచేశారు. నిబంధనలను ఉల్లంఘించి నిపుణుల సూచనలను ఖాతరు చేయకుండా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఉబిలో కూరుకు పోయిందని ఆయన వివరించారు.

జస్టీస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన 660 పేజీల నివేదిక పై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిపుణుల హెచ్చరికలను ఖాతరు చేయకపోవడమే ఇంతటి విపత్తుకు కారణమైందని ఘోష్ నివేదికలో తెలిపీయిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2015 లో విడుదల చేసిన జి. ఓ నెం 28 ద్వారా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వేమనపల్లిలో నిర్మించాలి అని చేసిన సూచనలు పట్టించుకోకుండా మెడిగడ్డ వద్ద సచేపట్టిన నిర్మాణం పూర్తిగా వ్యర్థం అని నివేదిక స్పష్టం చేసిందన్నారు.

ఉద్దేశపూర్వకంగా ఆ నివేదికను దాచి పెట్టి నాటి ముఖ్యమంత్రి,నీటిపారుదల మంత్రికి అనుకూలంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారని కమిషన్ వెల్లడించందని ఆయన తెలిపారు. 2016 లో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకుని 2019 లో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం అయిన మెడిగడ్డ బ్లాక్-7లోని 20 వ పిల్లర్ 2023 అక్టోబర్ 21 న అదీ బి.ఆర్.ఎస్ పాలనలోనే కూలిపోయిందన్నారు. 37,000 కాంక్రీట్ నమూనాలను,7,498 మాత్రమే పరిశీలించారని NDSA నివేదిక పేర్కొందని, అనకులంగా ఉన్న చోట నిర్మాణం చేపట్టడంతోటే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మూడు బ్యారేజ్ లకు జి.ఓ.నెంబర్లు 231,232 లకు క్యాబినెట్ ఆమోదం లేదని కమిషన్ స్పష్టం చేసిందన్నారు.ఆ సమయంలో నీటిపారుదల శాఖా మంత్రి ఆమోదం చట్టబద్దంగ చెల్లదని నివేదికలో తేట తెల్లం అయ్యిందన్నారు. పైగా 2019,2021 లలో మెడిగడ్డ కు ఇచ్చిన అనుమతులు కుడా పూర్తిగా తప్పుడవని కమిషన్ తేల్చిచెప్పిందని బ్యాంక్ గ్యారెంటీ లలో కుడా అవకతవకలు చోటు చేసుకున్నాయని కమిషన్ గుర్తించిందని ఆయన చెప్పారు. వరద రక్షణ చర్యలు ఇతరత్రా పేరుతో టెండర్లు లేకుండానే కాంట్రాక్టర్లకు పనులు అప్పనంగా అప్పగించారన్నారు. దురుద్దేశపురకంగా ఎటువంటి ప్రాజెక్టు నివేదిక లేకుండానే 369 కోట్ల విలువైన పనులు ఏజెన్సీలకు లబ్ది చేకూర్చే విదంగా రూపొందించారన్నారు.

బయటి రుణాల పేరుతో కే. ఐ. పి.సి.ఎల్ సంస్థ వద్ద ప్రభుత్వ హామీతో చేసిన 87,449 కోట్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 29,737 కోట్లు చెల్లించగా ఇంకా చెల్లించాల్సిన మూల ధనం 64,212 కోట్లు కాగా ఇంకా 41,638 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన అనంతరం పెరిగిన ధరల ప్రకారం అదనంగా 1342 కోట్లు చెల్లించడం తో పాటు అక్రమంగా మరో 612 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించరన్నారు. వీటన్నింటికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖామంత్రి హరీశ్ రావు,ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ లతో పాటు ఎస్.కే. జోషి ,స్మితా సబర్వాల్ లు ఇందుకు బాధ్యత వహించాలని కమిషన్ పేర్కొన్నట్లుగా మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రమాణాలకు విరుద్ధంగా సి.డి.ఓ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు తప్పుడు డిజైన్ లతో L&T, AFCONS, NAVAYUGA వంటి సంస్థలకు అక్రమ పద్ధతుల్లో లబ్ది చేకూర్చారన్నారు. తెలంగాణా కు జీవనాడి గా రూపాంతరం చెందాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళికలలో లోపం పరిపాలనా వైఫల్యం, సాంకేతిక నిర్లక్ష్యంతో ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story