జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయిన ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టడానికి ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావుతో కలసి మంత్రి శ్రీనివాసరెడ్డి గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వర్షాల కారణంగా ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు సెలవులో ఉన్న వెంటనే ఆ సెలవలను రద్దు చేసి వెనక్కి పిలిపించి విధుల్లో చేరేలా చూడాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. వర్షల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్సాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాల్లో పరిస్ధితి ఎలా ఉందనే విషయంపై మంత్రి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మెట్రో వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story