Minister Tummala Condemns: బాలికపై అఘాయిత్యం అమానుషమని మంత్రి తుమ్మల ఆవేదన.. బాధితురాలి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ
బాధితురాలి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ

Minister Tummala Condemns: ఖమ్మంలో పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించి, అనంతరం ఆమెను భవనంపై నుంచి తోసేసిన ఘటన అత్యంత అమానుషమైనదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యంపై ఆయన ప్రత్యేక ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవ్రాజ్‌తో మాట్లాడి బాలికకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడానికి వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టమైన భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో బాలిక వెన్నుపూసతో పాటు రెండు చేతులకు బలమైన గాయాలయ్యాయని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. బాధితురాలు పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.కమిషన్ సభ్యుల పరామర్శమరోవైపు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వందనగౌడ్, బండి అపర్ణ, చందన సందర్శించారు. ఆసుపత్రి వైద్యులను కలిసి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా, చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు స్పష్టం చేశారు.
- Tummala Nageswara RaoMinor Girl AssaultVictim SupportMedical ExpensesGovernment AssistanceChild SafetyWomen and Child WelfareTelangana NewsPublic WelfareLaw and OrderSocial JusticeGovernment ResponseVictim CarePolitical NewsBreaking NewsCurrent AffairsLatest Telugu NewsChild ProtectionPublic AffairsWelfare MeasuresSafety Concerns

