తీన్మార్‌ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ

MLC Teenmaar Mallanna: తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అని నామకరణం చేశారు. బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. పార్టీ జెండాను రెండు రంగులతో రూపొందించారు, దానిపై ‘ఆత్మగౌరవం, అధికారం, వాటా’ అనే నినాదాన్ని ముద్రించారు.

కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలు, పార్టీ విధానాలను ఉల్లంఘించడం వంటి కారణాలతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనపై సీరియస్ అయింది. 2025 ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే, మల్లన్న నుంచి వివరణ రాకపోవడంతో మే 1న ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మల్లన్న కొత్త పార్టీని ప్రకటించారు. ఈ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story