ఎస్‌ఈసీ రాణి కుముదిని

SEC Rani Kumudini: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌ రాణి కుముదిని తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్‌ను 100 శాతం వెబ్‌కాస్టింగ్‌తో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సాయంత్రం నాటికి ఓటింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాణి కుముదిని విజ్ఞప్తి చేశారు. వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థ ద్వారా ఓటర్లలో ఓటు వేయాలనే అవగాహనను కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆమె వివరించారు. పోలింగ్‌ ప్రక్రియ పండుగ వాతావరణంలో సాగుతోందని, చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి పెద్ద సమస్యలు ఎదురుకాలేదని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఓటర్ల సహకారంతో ఎన్నికలు విజయవంతమవుతాయని ఆమె అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story