మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం.. ఆగస్టులో పనులు ప్రారంభం

Musi Riverfront Project: హైదరాబాద్‌ నగర సౌందర్యీకరణ, ముసి నది పునరుజ్జీవనం లక్ష్యంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు తొలి దశ పనులు రూ.7,055 కోట్ల వ్యయంతో చేపట్టనున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ADB)తో చర్చలు పూర్తయ్యాయని అధికారులు ఉపసంఘానికి వివరించారు.

ఉపసంఘం సమావేశంలో డీపీఆర్ వివరాలను మంత్రులకు అధికారులు అందజేశారు. నిర్మాణాలపై ప్రభావం లేని 5 కి.మీ. మేర పనులు ముందుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. నిర్మాణాలకు తక్కువ ప్రభావం పడేలా అలైన్‌మెంట్ మార్చాలని మంత్రులు సూచించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ ఏడాది ఆగస్టు నుంచి పనులు ప్రారంభించి, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

సమావేశంలో మూసీపై రబ్బర్ డ్యామ్ నమూనాలను కూడా ఉపసంఘం సభ్యులు పరిశీలించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ముసి నది ఇరువైపులా అందమైన రివర్‌ఫ్రంట్, బ్రిడ్జీలు, బ్యారేజీలు, గ్రీన్ స్పేస్‌లు, వాటర్ రిటెన్షన్ సౌకర్యాలు ఏర్పాతాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టు ముఖ్యమైన మైలురాయని మంత్రులు అభిప్రాయపడ్డారు.

ప్రాజెక్టు అమలులో ప్రజల సమస్యలు, వ్యతిరేక అభిప్రాయాలను కూడా దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో ముందుకు సాగాలని ఉపసంఘం సూచించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story