సిట్‌ విచారణకు హాజరై సీయంపై ఫిర్యాదు చేసిన మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌ కుమార్

పెగాసెస్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ సహాయంతో నాఫోన్‌ తో పాటు మంత్రుల ఫోన్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని మీజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఫోన్‌ ట్యాపంగ్‌ కేసులో సోమవారం ప్రవీణ్‌ కుమార్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో ఉన్న సిట్‌ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రవీణ్‌ కుమార్‌ తన ఫోన్‌ ట్యాంపిగ్‌ చేస్తున్నరని రేవంత్‌ రెడ్డిపై ఫిర్యాదు చేశానని చెప్పారు. డార్క్‌ వెబ్‌ లో కొన్ని అరుదైన టూల్స్‌ వాడి నాఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని, అందుకే రేవంత్‌ రెడ్డి చేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ పై విచారణ జరిపి ఆయన్ను కూడా విచారించాలని ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని విచారించే వరకూ పోరాడతమని ప్రవీణ్‌ హెచ్చరించారు. రేవంత్‌ సర్కార్‌ చేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వ మద్దతు కూడా ఉందని ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఈరెండు పార్టీలు కలిసే ఫోన్‌ ట్యాపింగ్‌ కు పాల్పడుతున్నాయన్నారు. మంత్రులతో పాటు వ్యాపారవేత్తలు, ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లను కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని ప్రవీణ్‌ కుమార్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు సౌత్‌ ఫస్ట్‌ పోస్ట్‌లో ప్రచురించిన వార్తా కధనాల ఆధారంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. త్వరలో హైరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కు కూడా ఫిర్యాదు చేసి ముఖ్యమంత్రిని కూడా విచారణకు పిలవమన కోరుతామన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రతీకార పాలనలో భాగంగా సిట్‌ ను పావుగా వాడుకుంటున్నారని ప్రవీణ్‌ కుమార్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నందుకే బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ చేయాలని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తెరపైకి తెచ్చారని విమర్శించారు. కేసీఆర్‌ ప్రజలను నమ్ముకుని, ఆయన చేసిన మంచి పనులను నమ్ముకుని పని చేశారు తప్పితే ఫోన్‌ ట్యాపింగ్‌ కు పాల్పడలేదని ప్రవీణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించి సిట్‌ విచారణకు హాజరై వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Updated On 28 July 2025 3:43 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story