సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య అరెస్ట్

NIA on Alert: జనగామ జిల్లాలో సామాజిక ఉద్యమకారుడిగా పేరున్న గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శనివారం అరెస్టు చేశారు. జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి చేరుకున్న ఎన్‌ఐఏ బృందం నాలుగు వాహనాల్లో వచ్చి ఇన్నయ్యను అదుపులోకి తీసుకుంది.

ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి (అలియాస్ వికల్ప్) అంత్యక్రియలకు గాదె ఇన్నయ్య హాజరు కావడం, ఆ సందర్భంగా మావోయిస్టు భావజాలానికి అనుకూలంగా మాట్లాడి ప్రజలను ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐఏ ఈ చర్య తీసుకుందని తెలుస్తోంది.

అరెస్ట్ అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story