సీబీఐ విచారణ వద్దు: తెలంగాణ హైకోర్టు

Telangana High Court: జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో సీబీఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేసీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. హరీష్ రావు, కేసీఆర్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌కు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబరు 7 కి వాయిదా వేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story