Minister Tummala Nageswara Rao: ఎన్టీఆర్ పథకాలే అన్ని ప్రభుత్వాలకు స్ఫూర్తి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Minister Tummala Nageswara Rao: ఎన్టీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకు స్ఫూర్తి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
బుధవారం హైదరాబాద్‌లోని మైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన పనులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బండి రమేశ్, విగ్రహదాత కాట్రగడ్డ రమేశ్ తదితరులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ పాలించారని, అదే విధంగా ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అదే మార్గంలో ముందుకు సాగుతోందన్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవలను స్మరించుకుని, ఆయన చూపిన మార్గంలో సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

