CM Revanth Reddy: రాష్ట్ర బడ్జెట్‌ లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వివిధ శాఖల సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలని, ఆదాయ వనరులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలలో ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తోపాటు ఇతర శాఖల్లో ఎలాంటి లీకేజీలు లేకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు.

ఆదాయ సమీకరణను సమర్థవంతం చేయడానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసుకొని నిరంతరం ఫాలో అప్ చేయాలని, ఏఐ టెక్నాలజీని వినియోగించి లబ్ధిదారుల జాబితాను డీబీటీతో అనుసంధానం చేసుకోవాలని సీఎం సూచించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, ఇతర పనులను పూర్తి చేయడానికి అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించుకోవాలని, భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు.

ఊహాజనిత బడ్జెట్‌ కాకుండా వాస్తవికత ఆధారంగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలని ఆదేశించిన సీఎం, వివిధ శాఖలకు అన్ని రకాల సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ ఆదేశాలు కీలకం అని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story