కవితపై ఆగ్రహం వ్యక్తం

Padma Devender Reddy Warns: భారత రాష్ట్ర సమితి నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. శాసనసభలో కాళేశ్వరంపై కాంగ్రెస్ డొల్లతనాన్ని గుర్తించి మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తీవ్రంగా విమర్శించారని తెలిపారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి కాళ్లను హరీశ్‌రావు మొక్కారని కవిత చేసిన ఆరోపణలు తనను బాధించాయని వ్యాఖ్యానించారు.

"హరీశ్‌రావుపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే నేను సహించేది లేదు. కవిత గతంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినప్పుడు పార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదు. ఆమె ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ కుమార్తెగా గౌరవాన్ని కాపాడుకోలేకపోయింది. కవిత తనకు తాను గొయ్యి తవ్వుకున్నట్లు అయింది." అని పద్మా దేవేందర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story