Deputy Chief Minister Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు పెట్టి నెటిజన్లను ఆకట్టుకున్నారు. మంగళవారం తన నివాసంలో ప్రెస్ మీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని, రాజకీయ క్షేత్రంలో నిలబడి తీరుతామని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ప్రముఖ కవి శేషేంద్ర రాసిన కవితను పవన్‌ కల్యాణ్‌ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో

ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో

గెలుస్తుందో ఓడుతుందో

కానీ ముందుకు పోతుందో

అదే నా రాస్తా

ఏ రాస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో

ఏ రాస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో

ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో

ఈ కవిత ద్వారా పవన్‌ కల్యాణ్‌ తన రాజకీయ ప్రయాణం గురించి సంకేతాలు ఇచ్చినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story