Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సుదీర్ఘ విచారణ తర్వాత భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ముఖ్యులు ముగ్గురిని నిందితులుగా చేర్చుతూ అనుబంధ అభియోగపత్రం సిద్ధం చేసింది. న్యాయనిపుణుల ఆమోదం అనంతరం ఈ ముగ్గురిపై అభియోగాల నమోదుకు సాంకేతిక అనుమతులు తీసుకుని న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనుంది.

సిట్‌ దర్యాప్తు ప్రకారం, 2023 నవంబరు 15 నుంచి 30వ తేదీ వరకు స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) ద్వారా 4013 మందిపై నిఘా ఉంచినట్లు తేలింది. వీరిలో 618 మంది ఫోన్‌ సంభాషణలను అక్రమంగా ట్యాప్‌ చేశారని గుర్తించారు. కేసు ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ సీవోవో టి. ప్రభాకర్‌రావు విచారణలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పని చేశానని వాంగ్మూలం ఇచ్చాడు.

సిట్‌ వందలాది వ్యక్తుల వాంగ్మూలాలు సేకరించింది. మాజీ డీజీపీ, గత ప్రభుత్వంలోని సీఎంవో, హోంశాఖలో పని చేసిన ఉన్నతాధికారుల నుంచి కీలక సమాచారం తీసుకుంది. ఈ ఆధారాల ఆధారంగానే భారాస ముఖ్యుల ముగ్గురి పాత్రను నిగ్గుతేల్చింది. ఒక్కొక్కరి పాత్రను వివరంగా అభియోగపత్రంలో పొందుపరిచారు.

ఒకరి పాత్ర ప్రభాకర్‌రావు నియామకంలో మతలబు దాగి ఉందని సిట్‌ అనుమానం.

మరొకరు ఎలక్టోరల్‌ బాండ్ల విషయంలో ప్రమేయం.

ఇంకొకరు ఎవరిపై నిఘా ఉంచాలనే ఆదేశాలు ఇవ్వడంలో కీలక పాత్ర.

అయితే, గతంలో విచారించిన ఓ మాజీ ప్రజాప్రతినిధి పేరును అభియోగపత్రంలో చేర్చలేదు. సిట్‌ ఈ కేసును త్వరగా కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story