Ponguleti Srinivasa Reddy Says: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.

గత ప్రభుత్వానికి రూ.లక్ష రుణమాఫీ చేయడానికి పదేళ్లు పట్టిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.21 వేల కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి అన్న స్థితి ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ అందిస్తోందని చెప్పారు.

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతులకు ఎకరానికి రూ.12వేల ఆర్థిక సాయం, వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.1,200 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. “రైతును రాజుగా చేసే వరకు విశ్రమించబోము” అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story