సీఎంకు సీటు పోతుంది: నారాయణ ఫైర్

CPI Narayana Fires Strong Allegation: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అధికార పదవి ముప్పు ఏర్పడితే అది పూర్తిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వల్లనే అని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సీపీఐ అభ్యర్థుల విజయం కోసం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణ మండిపడ్డారు. "జాతీయ స్థాయిలో ఉన్న పొత్తులను కాదని కాంగ్రెస్ ఒంటరితనంతో వ్యవహరిస్తోంది. ఐదేళ్ల క్రితం పొంగులేటి ఏ పార్టీలో ఉన్నారో గుర్తుచేసుకోవాలి. పార్టీలు మారే నాయకులకు ప్రజల్లో గుర్తింపు ఉండదు" అని ఆయన అన్నారు.

ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట అని, కమ్యూనిస్టులు తల్లిపాల వంటివారని, డబ్బా పాలతో పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. "కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి పోతుందా? మొత్తం పురపాలికలు కాంగ్రెస్‌కే దక్కాలనే రాజకీయ దురుద్దేశంతోనే పొత్తులు కుదరనివ్వలేదు" అని ఆరోపించారు.

సమస్యలు పరిష్కరించే వారికే ప్రజలు ఓటేయాలని నారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story