ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తల పెట్టిన గోదావరి-బనకచర్ల అంశంపై జులై 1 న మంగళవారంరాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించాలని నిర్ణయించింది. డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో మద్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లతో సహా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం హాజరు కానున్నారు.

తెలంగాణా రాష్ట్ర ప్రజాప్రతినిధులందరికి నిజ నిజాలు తెలిపే విదంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సిద్దం చేశారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో అధికారులు అందరికీ అర్దమయ్యేలా పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించారు. బనకచర్లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేయడానికి మంత్రి ఉత్తమ్‌ కమార్‌ రెడ్డి నీటిపారుదల రంగ అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బ తింటున్నాయాన్న విషయాన్ని సమగ్రంగా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

Politent News Web 1

Politent News Web 1

Next Story