Tungaturthi MLA Mandula Samel: ‘నా టికెట్ రాజ్‌గోపాల్ ఇవ్వలేదు’.. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు

Tungaturthi MLA Mandula Samel: తుంగతుర్తి నియోజకవర్గంలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించానంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్‌గోపాల్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చారని, తాను ఆయన కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సామెల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చేది అధిష్టానం మాత్రమేనని, వ్యక్తిగతంగా ఎవరైనా టికెట్ ఇవ్వలేరని చెప్పారు.
‘నాకు రెడ్లు ఓటు వేశారు, రాజ్‌గోపాల్ రెడ్డికి మాదిగలు ఓటు వేశారు. రెడ్లు, దళితులతోనే రాజ్యం నడవదు. నాకు టికెట్ ఇచ్చింది ఏఐసీసీ. రాజ్‌గోపాల్ రెడ్డి కాదు’ అని ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా నియోజకవర్గానికి వచ్చి రోడ్డును పరిశీలించిన కోమటిరెడ్డి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో తన క్యాడర్ కూడా ఉందని, అక్కడ రాజ్‌గోపాల్‌ను గెలిపించినందుకు తన క్యాడర్ బాధపడుతోందని సామెల్ తెలిపారు.

