CM Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 1.34 కోట్ల మందికి మౌలిక వసతులు కల్పించడం, పాలనా సమన్వయం కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సైబరాబాద్‌లో రూ.1,674.74 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక సభలో పాల్గొని మాట్లాడారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చర్చించుకుందామని, ఈ రెండేళ్లు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సైబరాబాద్‌లో అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయని, దేశ ఐటీ ఎగుమతుల్లో 16.77 శాతం హైదరాబాద్ నుంచే జరుగుతోందని తెలిపారు.

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లు దేశ ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాయని సీఎం అన్నారు. ఈ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఢిల్లీలో కాలుష్యం కారణంగా స్కూళ్లు, ప్రధాని కార్యాలయం కూడా మూసివేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను నివాసానికి అనుకూలంగా ఉంచడానికి నిపుణులతో కమిటీ వేశామని, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను పంపిస్తే మోదీ ప్రధాని అయ్యారని, ఆ ఎంపీలు తెలంగాణకు ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. రెండేళ్లలో తాను ఏం చేయలేదని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని, తాము ఏం చేశామని వారు చెప్పాలని సవాల్ విసిరారు. నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుపుల్ల పెట్టారని ఆరోపించారు. సబర్మతి, గంగా, యమునా నదుల ప్రక్షాళనకు ప్రశంసలు అందుకుంటే, మూసీ ప్రక్షాళనకు బీజేపీ ఎంపీలు మోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

12 ఏళ్లుగా మోదీ ఏం చేశారో, తాను సీఎంగా రెండేళ్లలో ఏం చేశానో చర్చకు సిద్ధమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story