అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

  • అనుమతులు లేని విద్యుత్ కనెక్షన్లపై కఠినంగా స్పందించండి
  • హైదరాబాదులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులను వేగవంత చేయండి

విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను వెను వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా తొలగించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ సీఎం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. మానవీయ కోణంలో ఆలోచించి కేబుల్ వైర్లను తొలగించాలని గత సంవత్సర కాలంగా కేబుల్ ఆపరేటర్లకు పలుమార్లు నోటీసులు ఇచ్చాం, కావలసిన సమయం ఇచ్చాం అయినావారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణానికి ముప్పు ఏర్పడిందని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని యావత్ అధికారులు, సిబ్బంది విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే అధికారులు, సిబ్బంది వెంటనే కఠినంగా స్పందించాలని వాటిని తొలగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కనక్షన్ తీసుకునేవారు విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతోనే ఏర్పాటు చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం మూలంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశించారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు సంబంధించి కన్సల్టెంట్ సమర్పించిన డిపిఆర్ (డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పై సమావేశంలో చర్చించారు. సాగునీరు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వివిధ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ సరఫరా, వినియోగం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, జెన్కోసిఎండి. హరీష్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారుకి, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story