Andesri Passes Away: ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
అందెశ్రీ కన్నుమూత

Andesri Passes Away: ప్రముఖ రచయిత, కవి, సినీ గేయ రచయిత అందెశ్రీ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఇంట్లో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అందెశ్రీ మృతిపట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం' ను రచించారు అందెశ్రీ
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో1961 జూలై 18 నజన్మించారు అందెశ్రీ..అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన అనాథగా పెరిగారు, ఎలాంటి చదువు చదవకపోయినా, స్వీయకృషితో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించి ప్రజాకవిగా ఎదిగారు. బాల్యంలో గొర్రెల కాపరిగా పనిచేశారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు' (ఇది తొలిసారిగా ఆయనకు గుర్తింపు తెచ్చిన పాట).
'పల్లెనీకు వందనములమ్మో'.సినీ పాటలు ('గంగ' సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు). మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో, తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా కీలక పాత్ర పోషించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం అందుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం నుండి రూ. కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

