Revanth Reddy: కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
నూతన పారిశ్రామిక విధానం కార్మికుల అభ్యున్నతికి తోడ్పడుతుందని సీఎం తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫాం కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బిల్లును తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లించడం, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.
మేడే సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల త్యాగాలను ప్రశంసిస్తూ, ఉత్పత్తి రంగంలో దేశ సంపద సృష్టికి వారు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.

