Revanth Reddy: కేటీఆర్ దావత్‌పై రేవంత్ సెటైర్.. ‘ఆయనవన్నీ వేరే పార్టీలు’
‘ఆయనవన్నీ వేరే పార్టీలు’

Revanth Reddy: బీఆర్ఎస్ నేత కేటీఆర్, బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ అని ఆరోపించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ గ్లోబరీనా తప్పిదాల వల్ల 27 మంది చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సంస్థ పేరు మార్చుకొని CBSE పరీక్షల కాంట్రాక్టు పొందిందని, దీని ఆధారంగానే నీట్ కుంభకోణం జరిగిందని వ్యాఖ్యానించారు.
గ్లోబరీనా తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని సెటైర్ విసిరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
కేటీఆర్ బర్త్‌డే దావత్‌పై సెటైర్: కేటీఆర్ బర్త్‌డే దావత్ ఇస్తాడో అడగాలని, తాను ఆ దావత్ తీసుకోలేనేమో అని వ్యాఖ్యానించారు. "ఆయనవన్నీ వేరే పార్టీలు" అంటూ సెటైర్ విసిరారు. హరీష్ గొప్పవాడైతే మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. అతి తెలివి తేటలతో మాట్లాడితే నడవదని హరీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలు కన్నెపెల్లి పంపు హౌజ్ గురించి మాట్లాడుతున్నారని, మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డను కట్టింది, కూల్చింది బీఆర్ఎస్ వాళ్లే అని మండిపడ్డారు.
SIR ప్రక్రియపై సూచనలు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎమ్మెల్యేలు గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. SIR నాయకులకు కాదు, ప్రజలకు సంబంధించిందని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రపూరితంగా ఓట్లు తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు పోతే కాంగ్రెస్ ఓట్లు పోయినట్టేనని హెచ్చరించారు. ఓటు హక్కు లేకపోతే పథకాలు, ఆధార్, గుర్తింపు, సంక్షేమం అన్నీ పోతాయని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

