శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామాంతపూర్‌లో జరిగిన శోభాయాత్రలో విద్యుదాఘాతానికి గురై ఆరుగురు మృతి చెందడం పట్ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించి క్షతగాత్రులను మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. ఈ సందర్భగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రామాంతపూర్‌ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడ్డవారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఈ దురదృష్టకర సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి శ్రీధర్‌బాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరో వంద మీటర్ల దూరంలో శోభాయాత్ర ముగుస్తుందనగా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. కేబుల్‌ వైర్‌ ద్వారా కరెంట్‌ సరఫరా జరిగి ప్రమాదం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారని, ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయాలని కలెక్టర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. దర్యాప్తు నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story