Sampath Kumar: బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయనను బీఆర్ఎస్ డస్ట్‌బిన్‌లోని టిష్యూపేపర్‌గా అభివర్ణించారు.

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత ప్రవీణ్‌కు ఎక్కడిదని ప్రశ్నించిన సంపత్ కుమార్, కేసీఆర్ కాళ్లు మొక్కి ఒకే పోస్టులో ఏడేళ్లపాటు కూర్చున్నారని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్‌ను జాతి ద్రోహిగా పేర్కొన్న ఆయన, బీఎస్‌పీ పార్టీని కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు.

ఐపీఎస్‌గా పనిచేసిన వారు కూడా ఇలా ప్రవర్తించడం దారుణమని సంపత్ కుమార్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబ మాయమాటల మత్తులో ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ ఆ కుటుంబానికి ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు.

క్షుద్రపూజల ఆరోపణలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, సమాధానం ఇవ్వకుండా లీగల్ నోటీసులు పంపడం విడ్డూరమని సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు. నోటీసులు ఎప్పుడు పంపుతారో హరీశ్ రావుకు తెలియదా? అడ్వకేట్ ఉన్నారు కదా అని ప్రశ్నించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story