కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha’s Sharp Remarks: తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడిని దూరం చేసినవాడు మాజీ ఎంపీ సంతోష్‌రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. గద్దర్‌ లాంటి ప్రముఖ నాయకులు గేటు బయట ఉండాల్సి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం సంతోష్‌రావే అని ఆమె ఆరోపించారు.

నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్యను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్రంలో ఎక్సైజ్‌ పోలీసులపై గంజాయి సరఫరాదారులు, స్మగ్లర్లకు భయం లేదని విమర్శించారు. ఎక్సైజ్‌ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది వద్ద ఆయుధాలు ఉంటేనే నిజమైన భయం కలుగుతుందని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గృహ హింస కేసులు భారీగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సంతోష్‌రావుపై ఆమె మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సంతోష్‌రావు గూఢచారి. నేను ముందు నుంచే చెబుతున్న దెయ్యం ఆయనే. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ ఆయనకు ఏ రకమైన శిక్ష విధిస్తుందో వేచి చూడాలి. ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు లేదు’’ అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story