CM Revanth Reddy: కాంగ్రెస్ ఉన్నంత కాలం సెక్యులర్ వర్గాలకు మనుగడ: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం దేశంలో సెక్యులర్ వర్గాలకు మనుగడ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హిందూ, ముస్లింలను రెండు కళ్లలా కాంగ్రెస్ చూస్తోందని ఆయన అన్నారు.
నగరంలోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో గురువారం నిర్వహించిన మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. మైనారిటీ విద్యార్థులు, సివిల్ సర్వీసెస్, ఐఐటీ, ఐఐఎం, నీట్ వంటి పరీక్షల్లో ప్రతిభ చూపిన వారిని సన్మానించారు.
సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. వాటిని రద్దు చేయాలని కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా, గుజరాత్‌లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసి చూపాలని సవాల్ విసిరామని చెప్పారు. లౌకిక వర్గాల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం, రూ.3 కోట్ల ప్రోత్సాహకం ఇచ్చామని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ హయాంలో గ్రూప్-1 నియామకాల ఊసే లేదని, ఒకసారి చేపట్టినా పల్లీ, బఠానీల్లా ప్రశ్నపత్రాలు అమ్మారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఆర్‌ఎంపీ వైద్యుడిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యుడిగా నియమించినట్లు చెప్పారు. మా ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి విద్యావంతులను నియమించామని, టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్-1 పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. గ్రూప్-1 రద్దు చేయాలని బీఆర్‌ఎస్ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, మంచి న్యాయవాదిని నియమించి వాదనలు వినిపించి నియామకాలు పూర్తి చేశామన్నారు. గ్రూప్ 2, 3, 4 పోస్టుల విషయంలోనూ కోర్టుల్లో పోరాడి ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం చెప్పారు.
మైనారిటీలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన సూచించారు.
- RevanthReddyCMRevanthReddyCongressIndianNationalCongressSecularismSecularIndiaSecularForcesMinorityRightsMinoritiesHinduMuslimUnityTelanganaPoliticsTelanganaCMCongressPoliticsIndianPoliticsPoliticalNewsHyderabadMinorityExcellenceSummitMuslimReservationTelanganaNewsLatestPoliticalNewsLatestIndiaNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

