Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ 71% పూర్తి: కిషన్‌రెడ్డి
కిషన్‌రెడ్డి

Kishan Reddy: ప్రపంచస్థాయి సౌకర్యాలతో నిర్మిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులు 71 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో స్టేషన్‌కు ముందు, వెనుక వైపు కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
కిషన్‌రెడ్డి తన ఎక్స్ పోస్టులో స్టేషన్ పనుల వివరాలు, ఫొటోలను పంచుకుంటూ ఇలా అన్నారు: ‘‘స్కైవాక్‌తో నేరుగా మెట్రో రైలుకు ఈ స్టేషన్ అనుసంధానం అవుతుంది. ప్రస్తుతం రోజూ 180 రైళ్లతో లక్షన్నర మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్లో ఉత్తర, దక్షిణ దిశల్లో కొత్త భవనాలు అందుబాటులోకి వస్తాయి.’’ఇప్పటికే పూర్తయిన పనులు:
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) భవనం
కాజీపేట వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి
దక్షిణం వైపు స్టేషన్ భవనం గ్రౌండ్ ఫ్లోర్
ప్రయాణికుల రాకపోకల ప్రాంతాలు
దక్షిణ బేస్మెంట్
ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్
జరుగుతున్న పనులు:
ఉత్తర, దక్షిణ వైపులా స్టేషన్ భవనాల నిర్మాణం
నార్త్ మల్టీలెవల్ కార్ పార్కింగ్, బేస్మెంట్
ఎయిర్ కాన్కోర్స్
హైదరాబాద్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి
కవర్ ఓవర్ ప్లాట్‌ఫాంలు
ట్రావెలేటర్లతో కూడిన ఎఫ్‌ఓబీలు
మెట్రో కనెక్టివిటీ
ప్లాట్‌ఫాం ఫ్లోరింగ్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

