Seethakka Announces: మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు: మహిళా & శిశు సంక్షేమ మంత్రి సీతక్క
మహిళా & శిశు సంక్షేమ మంత్రి సీతక్క

Seethakka Announces: తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాల (SHG)కు మరో శుభవార్త ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.5 లక్షల వరకు ఇస్తున్న వడ్డీలేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు మహిళా & శిశు సంక్షేమ మంత్రి సీతక్క ప్రకటించారు.
ఈ క్రింది రూ.10 లక్షల బ్యాంకు రుణాలపై వచ్చే వడ్డీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు మహిళా స్వయం సహాయక బృందాలకు బ్యాంకు వార్షిక రుణ ప్రణాళికను గురువారం ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, సెర్ఫ్ సీపీఓ దివ్య దేవరాజన్, వివిధ బ్యాంకుల అధికారులు, స్త్రీ నిధి డిప్యూటీ ఎండీ శ్రీనాథ్ తదితరులు హాజరయ్యారు.
2025-26లో రూ.25,228 కోట్ల రుణాలు
మంత్రి సీతక్క మాట్లాడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్టు తెలిపారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు వ్యయం చేయనుందని వెల్లడించారు.
"మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి" అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మహిళలు పేదరికం నుంచి బయటపడితేనే అభివృద్ధి పూర్తి అవుతుందని సీతక్క అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె ఉద్ఘాటించారు.
ఈ నిర్ణయం మహిళా స్వయం సహాయక బృందాల ఆర్థిక సాధికారతకు బలం చేకూర్చనుందని, వారి వ్యాపారాలు, స్వయం ఉపాధి ప్రాజెక్టులు మరింత వేగంగా విస్తరించడానికి ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు.

