సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే సిగ్గు కాదు.. బాధ్యత – మహిళల ఫిట్నెస్పై ఉపాసన
Self-examination is not a shame.. it is a responsibility – Upasana on women's fitness
ప్రతీ యువతి, తల్లి, సోదరి.. ఎవరిని వాళ్లు ప్రేమించుకుంటున్నారంటే.. ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలని, ప్రతి మహిళకూ, యువతికీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ తప్పనిసరి అని ఉపాసన కొణిదెల చెప్పారు. తాజాగా జరిగిన ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు తాను కూడా మామోగ్రామ్ పరీక్షలు రెగ్యులర్గా చేయించుకుంటున్నానని చెప్పారు. తాను ఏ కార్యక్రమానికైనా ముందుగా పరీక్షలు చేయించుకున్న తర్వాతే వెళ్తానని, ఎందుకంటే నిజంగా దాని అవసరం ఏమిటో తనకు అర్థం అవుతుందని చెప్పారు.
హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన కొణిదెల పొలిటెంట్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే టిప్స్ చెప్పడంతో పాటు.. కుటుంబంలో మహిళల ఆరోగ్యం పురుషులకు కూడా ఎంత బాధ్యతో వివరించారు.
ఈ సందర్భంగా ఉపాసన మహిళలందరికీ మూడు ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలను వెల్లడించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, డీహైడ్రేట్ కాకుండా.. శరీరానికి తగినంత నీరు తాగాలని, ఆహారాన్ని అవసరమైనంత మేరకు తీసుకోవాలని, అలాగే విశ్రాంతి అనేది తప్పనిసరి అని భావించాలన్నారు. ఇదేమీ లగ్జరీ కాదని, నిత్యావసరం అనేది మహిళలందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.
మహిళలు మాత్రమే కాదు.. పురుషులు కూడా భర్తలు, అన్నలు, కుమారులు వారి కుటుంబంలోని మహిళల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని, ప్రశ్నించాలని, వాళ్ల ఆరోగ్యం పట్ల కుటుంబంలోని పురుషులు కూడా శ్రద్ధ వహించాలని ఉపాసన కొణిదెల విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించడం ద్వారా మార్పు మొదలవుతుందని ఉపాసన చెప్పారు.
