Minister Ponnam Prabhakar: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. హుస్నాబాద్‌లోని ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గం ఏడు మండలాల అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు.

భవిష్యత్ సవాళ్లు: తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని, వచ్చే జూన్ వరకు వర్షాలు లేకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారని తెలిపారు. పశువులకు మేత సమస్యలు ఎదుర్కొకుండా రైతులకు అవగాహన కల్పించాలని, కరవు పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేయాలని సూచించారు.

గ్రౌండ్ వాటర్ స్థాయి రోజురోజుకూ తగ్గుతోందని, దానిని పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు తవ్వాలని సూచించారు. "ప్రతి వర్షం చుక్కను కాపాడుకోవాలి" అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story