Supreme Court: పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానం వంటి కీలక అంశాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ తరపున కోర్టును కోరింది.

అయితే, ప్రధాన పిటిషన్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గుర్తించిన సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను నిరాకరించింది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

తెలంగాణ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం పిటిషన్‌లో 15 మంది ప్రతివాదులు ఉన్నారు. లోపాలు సరిదిద్దిన తర్వాత మిగతా అంశాలను పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. పిటిషన్‌పై విచారణ జరపకుండా నోటీసులు ఇవ్వడం సాధ్యం కాదని కూడా సూచించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story