Supreme Court notices to KTR

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని, స్పందన తెలియజేయాలని ఆదేశించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది.



తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.25వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ కేటీఆర్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుగుణ ఫిర్యాదుతో ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదయ్యింది. అయితే, తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కేటీఆర్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది.



అయితే, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... ఆత్రం సుగుణ సుప్రీం కోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. సుగుణ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదిగా ఉన్న కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం కేటీఆర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.


Updated On 7 Jun 2025 11:05 AM IST
Politent News Web4

Politent News Web4

Next Story