✕
Supremecourt : గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
By Politent News Web 1Published on 13 Aug 2025 5:41 PM IST
కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌ల ఎమ్మెల్సీ నియామకం రద్దు చేసిన సుప్రీం కోర్టు

x
తెలంగాణ శాసనమండలికి గవర్నర్ కోటాలో సభ్యులుగా నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణ పేర్లను అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించడంపై గతంలో శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ఈరోజు విచారించిన సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీం తాజా తీర్పుతో కోదండరామ్ అమీర్ అలీ ఖాన్‌ల శాసనసభ్యత్వాలు రద్దు కానున్నాయి.

Politent News Web 1
Next Story