పోలీసులు కొద్ది సేపటికే విడుదల

T. Harish Rao: ఇండస్ట్రియల్‌ పార్క్‌ బాధిత రైతులను కలిసేందుకు పరిగి వెళ్తుండగా అరెస్టు అయిన మాజీ మంత్రి హరీశ్‌రావు విడుదలయ్యారు. ఆయనతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలను శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు కొద్ది సేపటి తర్వాత విడుదల చేశారు.

విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. “మళ్లీ గెలుస్తామని రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌కు వచ్చేది సింగిల్‌ డిజిట్‌ మాత్రమే” అని ఆయన అన్నారు.

“రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ప్రతిపక్షాలు కనీసం ప్రశ్నించవద్దని, ధర్నాలకు పోవద్దని అంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు, విచారణలు, విజిలెన్స్‌ కేసులు అంటున్నారు. మమ్మల్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు.

వికారాబాద్‌ జిల్లా పరిగి వెళ్తుండగా నార్సింగి పోలీస్‌ అకాడమీ కూడలి వద్ద బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story