T. Jeevan Reddy: కేసీఆర్‌తో 5 గంటల భేటీ – కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పట్టు కోల్పోయింది: జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పట్టు కోల్పోయింది: జీవన్‌రెడ్డి

T. Jeevan Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సుదీర్ఘ సమావేశం అనంతరం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై నియంత్రణ పూర్తిగా కోల్పోయిందని, పార్టీ తిరోగమనంలో పయనిస్తోందని స్పష్టం చేశారు.
గతంలో పీసీసీ చెప్పినట్లు సీఎం నడుచుకునేవారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిందే పీసీసీ అమలు చేస్తోందని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో దాదాపు ఐదు గంటలపాటు సమావేశమైన ఆయన, తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన విషయంలో పీసీసీ తప్పు చేసి ఆ నిందను ఏఐసీసీపై వేస్తోందని ఆరోపించారు.
“నాకు 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థత వల్లే. కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలో ప్రయాణిస్తోంది. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రజల్లో చర్చలు మొదలయ్యాయి. త్వరలోనే జగిత్యాలలో సభ నిర్వహించి బీఆర్‌ఎస్‌లో చేరతాను” అని జీవన్‌రెడ్డి ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.

