✕
తెలంగాణ మంత్రి మండలి భేటీ

x
Telangana:గురువారం జరిగిన తెలంగాణ మంత్రి మండలి సమావేశంలో ప్రధాన రాజకీయ అంశాలపై చర్చించేందుకు సమయం అందకపోవడంతో, ఉద్యోగుల సమస్యలపై ఎక్కువ దృష్టి సారించినట్లు సమాచారం. సమయం మించిపోయిన తర్వాత, మరో 15-20 రోజుల్లో మళ్లీ మంత్రి మండలిని సమావేశపరచాలని, అందులో అన్ని అంశాలను చర్చించాలనే ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తేదీని నిర్ణయించి సమాచారం అందించాలని సూచించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, వార్డుల విభజన ప్రక్రియ మరియు రిజర్వేషన్ల ఖరారు జరుగుతోందని, ఈ నెలాఖరుకు ఇది పూర్తవుతుందని, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చని సీఎం చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉందని మంత్రులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు, ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

PolitEnt Media
Next Story
