భారాస, భాజపా ఒక్కటే.. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై భాజపా నేతలు నోరు మెదపలేదు: సీఎం రేవంత్

ఫోన్ ట్యాపింగ్ కేసుకు హరీశ్‌రావుపై కొట్టేసిన కేసుకు సంబంధం లేదు.. బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం

Telangana Chief Minister A. Revanth Reddy: మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులపై కాల్పులు జరిగినా భాజపా నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రామచందర్‌రావు ఎందుకు నోరు మెదపలేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అయిన దానికి, కాని దానికి స్పందించే భాజపా నాయకులు.. భారాస మాజీ ఎమ్మెల్యే ఫాం హౌస్‌లో ఇంత పెద్ద ఘటన జరిగినా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా?’’ అని ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో అన్నారు.

మూసీ నది ప్రాజెక్టుపై రాజీ లేదని, ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. భారాస హయాంలో దాదాపు 6 వేల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయని, ఈ కేసు విచారణలో ప్రభాకర్‌రావు అందుబాటులో లేకపోవడంతో 20 నెలలు ఆలస్యమైందని తెలిపారు. ‘‘ఆయన ఇచ్చిన వివరణ ద్వారా బాధితులను పిలిపించి విచారిస్తున్నాం. ఎవరినైనా బెదిరించారా? ఒత్తిడి చేశారా? ఆర్థికంగా లబ్ధి పొందారా? అన్నది విచారణలో తేలుతుంది. తర్వాతే కేసు ఫైల్ చేస్తారు’’ అని వివరించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు క్లీన్ చిట్ వచ్చిందని హరీశ్‌రావు చెబుతున్నారని, అది సరికాదని, ఆ కేసుకు తనకు సంబంధం లేదని సీఎం స్పష్టం చేశారు.

బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మీడియాతో చర్చలో ఆయన వివిధ అంశాలపై స్పందించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story