రూ.3.24 లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

Telangana government's annual budget: తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మంగళవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం చేసి, మొత్తం రూ.3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రకటించారు. గత ఏడాది బడ్జెట్‌ కంటే ఇది గణనీయంగా పెరిగింది. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా నిర్ణయించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అంబేడ్కర్‌ అడుగుజాడల్లో పాలన సాగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం లభించింది. శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

కీలక పథకాలు, కేటాయింపులు

ఆరు గ్యారంటీల అమలుకు రూ.50,713 కోట్లు

రైతు భరోసా.. రూ.18 వేల కోట్లు

చేయూత పథకం.. రూ.14,861 కోట్లు

ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5,500 కోట్లు

మహాలక్ష్మీ పథకం.. రూ.4,305 కోట్లు

గృహజ్యోతి పథకం.. రూ.2,080 కోట్లు

మహాలక్ష్మీ గ్యాస్‌ సబ్సిడీ.. రూ.723 కోట్లు

కల్యాణ లక్ష్మీ పథకం.. రూ.3,683 కోట్లు

1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా (ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా).. రూ.4 వేల కోట్లు (జూన్‌ 2 నుంచి అమలు)

ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు అల్పాహారం, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతనం

యంగ్‌ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు

మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌.. రూ.1,500 కోట్లు

మెట్రో రైలు ఫేజ్‌-2.. రూ.600 కోట్లు

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ.. రూ.1,143 కోట్లు

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత, డిజిటల్‌ హెల్త్‌ కార్డు

వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్‌.. రూ.3,500 కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు

విద్యా శాఖకు రూ.26,674 కోట్లు

వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు

విద్యుత్‌ శాఖకు రూ.21,285 కోట్లు

వైద్య శాఖకు రూ.13,679 కోట్లు

ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు

బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు

ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు

మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు

పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు

మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు

పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు

పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు

ఉపకార వేతనాలకు రూ.4,343 కోట్లు

ఇతర ముఖ్యాంశాలు

కొత్త రుణాలు రూ.73,383 కోట్లకు ప్రతిపాదన. బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ హామీల అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఈ బడ్జెట్‌ బలమైన పునాది వేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story